స్వాతిముత్యం
తను: “మళ్ళీ న్యూ ఇయర్ వచ్చింది” నోటితో మాట్లాడుతూ,నొసటితో వెక్కిరించింది.
నేను: “అయితే ఏంటట?” తాపీగా అన్నాను.
తను: “మరి నువ్వు కొత్త ఆలోచనలు.. సరికొత్త resolution అంటూ బయలుదేరుతావ్ కదా!”,అంది కళ్ళ తోనే నవ్వుతూ.
నేను: “మరే!గురివింద గింజ తన క్రింద నలుపెరుగదట!” అన్నాను రోషంగా.
తను: “నా సంగతి ఎందుకులే..నీ సంగతి చెప్పు..”
నేను: “ఇంతకీ, ఏంటి నీ గోల?”
తను: “గోల కాదు బుద్దూ ..గోల్ గురించి అడుగుతున్నా”
నేను: “చెప్పడం కంటే, చేసి చూపిస్తే బాగుంటుంది అనుకుంటున్నా..”
తను: “ఆడియో లేకుండా వీడియో బాగోదేమో?”
నేను: “చెప్తే సటైర్.. చెప్పకపోతే సజషన్..నీకు తెలిసింది అదేనా?”
తను: “అవునని చెబితే?”
నేను: “పొగరు అంటారేమో దానినే..”
తను: “ఏం వుండకూడదా?”
నేను: “నిజం గా పొగరే!”
తను: “అది సరే గాని,ఇంకా నా ప్రశ్న కి జవాబు చెప్పలేదు”
నేను: “చంద్రబింబం లాంటి రూపం ..దాన్ని మించిన వ్యక్తిత్వం..సాంప్రదాయాలను గౌరవించే సౌశీల్యం..ఎదుటి వారిని జయించే ధైర్యం ..కొంచం అహంకారం ..మరికొంత ఆత్మవిశ్వాసం..వీటి మేళవింపే స్వాతిముత్యం లాంటి నువ్వు”
తను: “…”
మొత్తం విని “తను” కళ్ళు తెరచుకొన్నాయి.బుగ్గలు ఎరుపెక్కాయి. నోరు మూతబడింది…..అక్కడి నుండి తుర్రు మంది మరో మాట మాట్లాడకుండా!! రాత కోతల అనుభవంతో,బుర్రసాము చేసి,బయటపడ్డా అప్పటికి..
నీతి: భామ ముందు సాముగరీడీ కి, కర్ర సాము కన్నా బుర్రసాము మిన్న..
చాలా అందముగా వ్రాశేరు. ఆభారములు.
@पा.ना. सुब्रमणियन :: Thanks