Skip to content

స్వాతిముత్యం

December 25, 2008

తను: మళ్ళీ న్యూ ఇయర్ వచ్చింది” నోటితో మాట్లాడుతూ,నొసటితో వెక్కిరించింది.
నేను:అయితే ఏంటట?” తాపీగా అన్నాను.
తను:మరి నువ్వు కొత్త ఆలోచనలు.. సరికొత్త resolution అంటూ బయలుదేరుతావ్ కదా!”,అంది కళ్ళ తోనే నవ్వుతూ.
నేను:మరే!గురివింద గింజ తన క్రింద నలుపెరుగదట!” అన్నాను రోషంగా.
తను:నా సంగతి ఎందుకులే..నీ సంగతి చెప్పు..”
నేను:ఇంతకీ, ఏంటి నీ గోల?”
తను:గోల కాదు బుద్దూ ..గోల్ గురించి అడుగుతున్నా”
నేను:చెప్పడం కంటే, చేసి చూపిస్తే బాగుంటుంది అనుకుంటున్నా..”
తను:ఆడియో లేకుండా వీడియో బాగోదేమో?”
నేను:చెప్తే సటైర్.. చెప్పకపోతే సజషన్..నీకు తెలిసింది అదేనా?”
తను:అవునని చెబితే?”
నేను:పొగరు అంటారేమో దానినే..”
తను:ఏం వుండకూడదా?”
నేను:నిజం గా పొగరే!”
తను:అది సరే గాని,ఇంకా నా ప్రశ్న కి జవాబు చెప్పలేదు”
నేను:చంద్రబింబం లాంటి రూపం ..దాన్ని మించిన వ్యక్తిత్వం..సాంప్రదాయాలను గౌరవించే సౌశీల్యం..ఎదుటి వారిని జయించే ధైర్యం ..కొంచం అహంకారం ..మరికొంత ఆత్మవిశ్వాసం..వీటి మేళవింపే స్వాతిముత్యం లాంటి నువ్వు”
తను: “…”

మొత్తం విని “తను” కళ్ళు తెరచుకొన్నాయి.బుగ్గలు ఎరుపెక్కాయి. నోరు మూతబడింది…..అక్కడి నుండి తుర్రు మంది మరో మాట మాట్లాడకుండా!! రాత కోతల అనుభవంతో,బుర్రసాము చేసి,బయటపడ్డా అప్పటికి..

నీతి: భామ ముందు సాముగరీడీ కి, కర్ర సాము కన్నా బుర్రసాము మిన్న..

2 Comments
  1. చాలా అందముగా వ్రాశేరు. ఆభారములు.

  2. Subba Reddy permalink

    @पा.ना. सुब्रमणियन :: Thanks 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: